కొవ్వుతగ్గించే ద్రాక్ష

ద్రాక్షపండ్లలో పొటాషియం పుష్క లంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్త పోటుతో బాధపడే వారికి ద్రాక్షలు మంచి మందు. సోడియం మోతాదును తగ్గించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ద్రాక్షల్లో టీరోస్టిల్‌బెన్‌ అనేది మరో కీలక పదార్థం. ఇది కొలెస్ట్రాల్‌. ట్రైగ్లిజరైడ్లు కొవ్ఞ్వలను నియంత్రించే ఎంజైమ్‌ చర్యలను అడ్డుకోకుండా నివారిస్తుంది. ద్రాక్షపండ్ల తొక్కలో ఉండే సెపోనిన్స్‌ కొలెస్ట్రాల్‌ను గ్రహి స్తాయి. తద్వారా శరీరం అధిక కొలెస్ట్రాల్‌ను తీసు కోకుండా అడ్డుకుంటాయి. అంతేకాక రక్తనాళాల్లో వాపును కూడా తగ్గిస్తాయి. ద్రాక్షరసంలో ఉండే అల్ఫా టోకోఫెరాల్‌ రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ల చర్యాశీలతను 50శాతం పెంచుతుంది. ఎరుపు దాక్షలు గుండెకు ఎక్కువ మేలు చేస్తాయి. వందగ్రా. ద్రాక్షలో ఉండే పోషకాలు :శక్తి-69కేలరీలు, కార్బొహైడ్రేట్లు-18గ్రా. ప్రొటీన్లు-0.72గ్రా, కొవ్ఞ్వలు-0.16గ్రా, కొలెస్ట్రాల్‌-లేదు, డయెటరీ ఫైబర్‌-0.9గ్రా, విటమిన్‌-సి-10.8మైక్రోగ్రాములు, ఫోలేట్స్‌-2 మైక్రోగామ్‌, కాల్షియం-10మిల్లిగ్రామ్‌, బీటాకెరోటిన్‌-39 మైక్రోగ్రామ్‌.

No comments:

Post a Comment