పుచ్చకాయతో ఉపయోగాలు

పుచ్చ పండులో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. పుచ్చకాయలో పొటాషియం ఎక్కువ ఉన్నది కాబట్టి మూత్రపిండాలు పనిచేయక ఉన్నవారు పుచ్చకాయలు తినరాదు. కానీ మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారు మూత్రపిండాలలో, మూత్రకోశంలో చిన్న చిన్న రాళ్లు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్‌ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. వేసవిలో అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గాలంటే పుచ్చకాయ తింటే నివారిస్తుంది. అన్ని రకాల జ్వరాలలో పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. ఎండిపోయే పెదవులు తడిగా ఉంచుతుంది.

No comments:

Post a Comment