పళ్ళు (fruits) రంగులు వాటి ఉపయోగాలు

పలురంగుల్లో లభించే ఆహారపదార్థాలు శరీరంలోని వివిధ భాగాలకు లాభం చేకూరుస్తాయని పరిశోధకులు చెపుతున్నారు. ఏయే రంగులు శరీరంలోని ఏయే భాగాలకు ఉపయోగపడుతుందనేది తెలుసుకుందాం. తెలుపురంగు ఉర్లగడ్డ, వెల్లుల్లి, తెల్లటి పుట్టగొడుగులు మొదలైనవి మీ ఊపిరితిత్తులకు లాభకారిగా ఉంటాయని పరిశోధకులు చెపుతున్నారు.
నారింజరంగు కమలాపండులో విటమిన్‌ సి ఉంటుంది. ఇందులో కాసింత విటమిన్‌ ఎ కూడా ఉంటుంది. ఈ రంగులో నున్న పండ్లు శరీరంలోని రక్తహీనతలను తగ్గిస్తాయి.

పచ్చరంగులో నున్న కూరగాయలు, పండ్లలో లూటీస్‌, ఇండోల్‌ అనే పైటో కెమికల్స్‌ ఉన్నాయి. ఇవి కాలేయానికి బలాన్ని చేకూరు స్తాయి. కాబట్టి పచ్చరంగులో నున్న పండ్లు, కాయగూరలు ఆహారంగా తీసుకోండి. దీంతో కాలేయం బలంగా ఉంటుంది.
నేరేడు పండు రంగు మీ మెదడు పనితీరు బాగుండాలని కోరుకుంటుంటే నేరేడు పండ్లను ఎక్కువగా తినండి. వీటితో పాటు నల్లద్రాక్ష, ఎర్రగడ్డలు, వంకాయ లను అధికంగా తీసుకోండి. వీటితో మీ మెదడు పనితీరు మెరుగౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నలుపురంగు అతికొద్దిమందికి నచ్చుతుంది. ముఖ్యంగా ఆహారపదార్థాలలోనైతే మరీను. కాని నలుపురంగులో నున్న ఆహార పదార్థాలు మూత్రపిండాలకు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. దీంతో మిరియాలు, ఎండుద్రాక్ష తదితరులు ఆహారంగా తీసుకోవాలి.
ఎరుపురంగు మీరు మీ గుండెను ఆరోగ్యంగా కాపాడాలనుకుంటే ఎరుపు రంగు కలిగిన ఆహారపదార్థాలను సేవించండి. ఎరుపు, గులాబీ రంగులో నున్న పండ్లు, కూరగాయలలో పైటోకెమికల్స్‌ ఉంటాయి. పుచ్చకాయ, జామకాయ, టమోటా మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి. (స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ, బీట్రూట్‌లలో ఎంతో సాయనిన్‌ ఉంటుంది. ఇది పైటోకెమికల్స్‌ కోవకు చెందినది. ఇవి అధిక రక్తపోటును నివారించడంతో పాటు మధుమేహ వ్యాధికి సంబంధించిన సమస్య లను అదుపులో ఉంచుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

No comments:

Post a Comment