సంపూర్ణ ఆరోగ్యం

కాణీ ఖర్చు లేకుండా ఊబకాయాన్ని తగ్గించుకోవడంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఎలా ఉంచుకోవాలో తెలుసా? దీనికి కావలసిందల్లా ఓ 40 నిమిషాలు మీ సమయాన్ని వెచ్చించడమే మీరు చేయాల్సింది. అదెలాగంటే రోజూ కనీసం ఓ 40 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే చాలు ఒబేసిటితో పాటు డయాబెటిస్, బిపి, ఎసిడిటి లాంటి వ్యాధులన్నీ తగ్గుముఖం పడతాయి. వాకింగ్‍ని మూడు భాగాలుగా చేసుకోవాలి. మొదటి 10 నిమిషాలు మెల్లగా నడవాలి. తరువాతి 20 నిమిషాలు వేగంగా అంటే బ్రిస్క్ వాకింగ్ చేయాలి. చివరి 10 నిమిషాలు క్రమంగా స్లో అయిపోవాలి. సాధ్యమైనంత వరకు ఎగుడు దిగుడు రోడ్ల మీద కాకుండా ప్లెయిన్‌గా ఉన్న రోడ్ల మీదే వాకింగ్ మంచిది. చెప్పులతో కాకుండా స్పోర్ట్ షూస్ వేసుకునే వాకింగ్ చేయాలి.

No comments:

Post a Comment