తేనెతో ఉపయోగాలు

అరకప్పు తేనె తీసుకుని కుదుళ్ళ నుంచి తలంతా రాసుకుని క్యాప్‌ పెట్టుకోవాలి. అరగంట తరువాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మంచి నిగారింపు సంతరించుకుంటుంది. తలస్నానం చేసిన అరగంట తరువాత కప్పు తేనెకు పావుకప్పు ఆలివ్‌ నూనె కలిపి తలకు మర్దన చేయాలి. పావుగంటయ్యాక కడుక్కుంటే సరిపోతుంది. ఫలితంగా కురులు పట్టుకుచ్చులా మెరుస్తాయి. ఇలా పదిహేను రోజులకోసారి చేయాలి. అరకప్పు కొబ్బరి నూనెను వేడి చేసి నాలుగు చెంచాల తేనెను కలపాలి. కుదుళ్ళకు రాసుకుని మర్దన చేయాలి. గంటయ్యాక తలస్నానం చేస్తే చాలు. జుట్టు రాలకుండా ఉంటుంది. ఇలా వారానికోసారి చేస్తే ఈ సమస్య చాలావరకు అదుపులోకి వచ్చేస్తుంది. కప్పు ఆలివ్‌ నూనెకు, అరకప్పు తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి తలకు మర్దన చేయాలి. అరగంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చెంచా తేనెలో చిటికెడు పంచదార కలిపి ముఖానికి మృదువుగా మర్దన చేయాలి. తేనె చర్మం మీద మృత కణాలను తొలగించి, చర్మానికి తేమను అందిస్తుంది.

No comments:

Post a Comment