కళ్లకింద నల్లటి వలయాలు రాకుండా జాగ్రత్తలు

  • కీరదోస కీరదోసకాయలను గుండ్రంగా స్లైస్‌గా కట్‌చేసి కళ్ళమీద పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల కళ్ల కింద వలయాలను, కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది. అలాగే వాపును కూడా తగ్గిస్తుంది. 

  • టీ బ్యాగ్స్‌ అలసిన కళ్ళ మీద మీరు ఉపయోగించిన టీ బ్యాగ్స్‌ను పెట్టుకోవాలి. టీ బ్యాగ్‌ కళ్ళమీద పెట్టి పది, పదిహేను నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే టీబ్యాగ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ప్రీమెచ్యూర్‌ ఏజింగ్‌ను నివారిస్తుంది. టీ బ్యాగ్‌ పెట్టుకోవడానికి ముందు వాటిని ఐస్‌వాటర్‌లో డిప్‌ చేయాలి. 

  • మసాజ్‌ మీ కళ్ళను నిదానంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే మీ మధ్యవేలుతో కళ్ళమీద కనురెప్పమీద క్రింది భాగం కొంతసేపు నొక్కి పట్టుకోవాలి. కొంత సమయం తర్వాత వేళ్లు తీయాలి. ఇలా రెండు మూడుసార్లు సాధన చేయాలి.  

  • రోజ్‌వాటర్‌ కాటన్‌బాల్స్‌ను చల్లగా ఉండే రోజ్‌వాటర్‌లో డిప్‌ చేసి కళ్ళమీద పెట్టుకుని 10నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇది కళ్ళకు చాలా బాగా పనిచేసి కళ్ళ కింద వలయాలను తొలగిస్తుంది.  

  • స్పూన్‌ ట్రిక్‌ మెటల్‌ స్పూన్స్‌ను రిఫ్రిజిరేటర్‌ ఫ్రీజర్‌లో 20నిముషాలు పెట్టాలి. తర్వాత 20 నిముషాల తర్వాత వాటిని బయటకు తీసి కళ్ళు ఉబ్బిన ప్రదేశంలో వాటిని నిదానంగా మర్దన చేసినట్లు రుద్దాలి.  

  • కాస్మొటిక్స్‌ ఈ సమస్య నివారణకు అనేక కాస్మొటిక్స్‌ ట్రీట్‌మెంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. తక్షణ మార్పుల కోసం ప్లాస్టిక్‌ సర్జరీ వంటివి కళ్ళ క్రింది ఉబ్బును తగ్గించడానికి సహాయపడతాయి.  

  • క్రాన్‌బెర్రీ జ్యూస్‌  తియ్యగా లేని క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను నీటితో మిక్స్‌చేసి, దీన్ని ప్రతి రోజు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. కళ్ళు ఉబ్బుతో బాధపడే టప్పుడు, ఈ క్రాన్‌బెర్రీ జ్యూస్‌ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అలాగే ఈ నీటితో కళ్ళను కూడా శుభ్రం చేసుకోవచ్చు. 

  •  ఎగ్‌ వైట్‌ అరచెంచా ఎగ్‌ వైట్‌ తీసుకుని మీ కళ్ళ చుట్టూ సున్నితంగా గుడ్డు తెల్లసొన మసాజ్‌ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. 

  • బాదం నూనె  మీ కళ్ళ చుట్టూ బాదంనూనెతో మసాజ్‌ చేసుకోవడం వల్ల నల్లటి వలయాలను తగ్గిస్తుంది. రక్తప్రసరణ పెంచుతుంది.

No comments:

Post a Comment