మూలి పరోట

  కావలసినవి
గోధుమ పిండి   అర  కిలో
ముల్లంగి దుంపలు 3 తురిమి నీరు తీసేయాలి
ఆనియన్             2  
పచ్చి మిర్చి          4
కొత్తిమీర       ఒక కట్ట
సాల్ట్                   తగినంత
ఆయిల్ కానీ నేయి కానీ బట్టర్ కావలసినంత 
 వీటన్నింటిని సన్నగా ముల్లంగి తురుములాగే సన్నగా తరగాలి

చేయు విధానం ----  ముందుగా గోధుమ పిండిలో కొంచం నీరు సాల్ట్ వేసి కలిపి వుంచుకొని కొంచెం పెద్ద గా ఉండలు చేసి పెట్టుకోవాలి తర్వాత తుర్ముకున్న ముల్లంగి ఉల్లి పచ్చిమిర్చి కొత్తిమీర  సాల్ట్ ని బాగా కలుపుకొని గోధుమ పిండి  ఉండను ఒక బౌల్ లా  చేసి అందులో ఈ ముల్లంగి మిశ్రమాన్ని పెట్టి  మొత్తం క్లోజ్ చేయాలి వీటిని పలుచని  ప్లాస్టిక్ పేపర్  మధ్యలో పెట్టి పైన ఇంకో పేపర్ పెట్టి వేళ్ళతో గుండ్రంగా పల్చగా వతుకోవాలి తర్వాత నేయి తో కానీ వెనతో కానీ పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి  ఇవి గడ్డ పెరుగుతో తింటే చాల బాగుంటాయి ఇలాగే  ఆలు గోభి  మేతి పరోటాలు చేసుకోవచ్చు వీటికి దేశి ఘీ వాడితేనే టేస్ట్ బాగుంటుంది

No comments:

Post a Comment