జుట్టు రాలకుండా ఆపడం ఎలా?

  • హెయిర్‌ డ్రయ్యర్‌ను మరీ దగ్గరగా ఉంచి వాడితే జుట్టురాలే ప్రమాదం ఉంది. డ్రయ్యర్‌ను 10 అంగుళాల దూరంగా ఉంచి వాడాలి. 
  • తలవెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు 'బి కాంప్లెక్స్‌ ఐరన్‌ టాబ్లెట్స్‌ యాక్స్‌సాల్‌ క్యాప్సూల్స్‌ ప్రతిరోజూ ఒకటి చొప్పున వేసుకోవాలి.
  • తలకి స్నానంచేసేటపుడు వొంటిసబ్బులు వాడకండి. గోరింటాకులో నిమ్మరసం, కోడిగుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రుపోవటమే కాదు జుట్టుపట్టులా మెత్తగా ఉంటుంది. 
  • మందారపూలు ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి కాచి వడగట్టిన తర్వాత రాసుకుంటే తల వెంట్రుకల ఎదుగుదలకు, జుట్టు రాలకుండా ఉండేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. 
  • బాగా వేడి నీటిని తలపై పోసుకోకూడదు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్‌ అప్లయి చేయాలి. లేదా కండీషనర్‌ కలిసి ఉన్న షాంపూను ఎంచుకోవాలి. 
  • హెయిర్‌ డ్రయర్‌ను జుట్టుకు కనీసం పది అంగుళాల దూరంలో ఉండాలి. అసలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది. వారానికి రెండుసార్లు తలకు నూనె పెట్టుకుని, ఆ నూనెను రాత్రంతా అలా ఉంచేయాలి.
  • వారానికి రెండుసార్లు పెరుగు లేదా గుడ్డులోని పచ్చసొన పొడి జుట్టుకు అప్లయి చేస్తే కేశాలు మృదువుగా ఉంటాయి. 
  • కొబ్బరినూనె, నువ్వులు లేదా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వేడిచేసి మాడుకు, శిరోజాలకు పట్టించి వేడినీటిలో ముంచిన టవల్‌ తలకు చుట్టుకోవాలి. ఐదు నిమిషాలుంచి, మరోమారు టవల్‌ను వేడినీటిలో ముంచి చుట్టుకుని కొద్దినిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మాడు నూనెను బాగా గ్రహిస్తుంది. 
  • పొడిగా, పేలవంగా జుట్టు ఉన్నట్లయితే ఒక కప్పు తేనె, అరకప్పు ఆలివ్‌ ఆయిల్‌ లేదా నువ్వుల నూనె, రెండు టేబుల్‌ స్పూన్లు నిమ్మరసం కలిపి ఓ రాత్రంతా ఉంచేసి కొద్దిగా తీసుకుని తలకు మసాజ్‌ చేయాలి. వేడి టవల్‌ చుట్టుకుని కొద్దిసేపు షాంపూ చేసుకోవాలి. 
  • జుట్టు పొడిగా దెబ్బతిని ఉన్నట్లయితే ఒక టీ స్పూన్‌ ఆముదం, రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనెను కలిపి మసాజ్‌ చేసుకుని వేడినీటి టవల్‌ చుట్టి ఆ పై స్నానం చేస్తే జుట్టు ఊడకుండా ఉంటుంది.

No comments:

Post a Comment