శనగలతో మధుమేహం దూరం

భోజనానికి ముందు మొలకెత్తిన శనగలను తీసుకుంటే మధుమేహం వచ్చే ముప్పు తగ్గుతుందట! హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) నిపుణులు ఈ పరిశోధన చేశారు. భోజనానికి ముందు 50గ్రా. మొలకెత్తిన శనగలను తింటే...ఆహారం ద్వారా శరీరానికి అందే కార్బొహైడ్రేట్లు వేగంగా అరగకుండా నియంత్రిస్తున్నాయని ఏకే తివారీ నేతృత్వంలోని అధ్యయన బృందం పేర్కొంది. దీంతో రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటోందని తెలిపింది. శనగల వినియోగంతో మధుమేహాన్ని నివారించవచ్చని వివరించింది.

No comments:

Post a Comment