కొత్తిమీర, నువ్వుల పచ్చడి

 కావలసినవి :

కొత్తిమీర - 2 కప్పులు
 చింతపండు - 100 గ్రా.
నువ్వులు - 50 గ్రా.
పచ్చిమిర్చి -3
ఎండుమిర్చి - 3
జీలకర్ర - 1 టీ.స్పూ.
 ధనియాలు - 2 టీస్పూ.
 మినప్పప్పు - 1 టీస్పూ.
పసుపు - 1/4 టీ.స్పూ.
పోపుకు: ఆవాలు,
జీలకర్ర - 1/2 టీ.స్పూ.
 మినప్పప్పు- 1/2 టీ.స్పూ.
 ఎండుమిర్చి - 2
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 2 రెబ్బలు
ఉప్పు - తగినంత
నూనె - 6 టీ.స్పూ.

తయారీ :
 కొత్తిమీర శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. పాన్ వేడి చేసి నువ్వులు దోరగా వేయించుకోవాలి. అందులోనే చెంచాడు నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు వేయించి తీసుకోవాలి. ఇంకో రెండు చెంచాల నూనె వేడి చేసి కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. ఇందులోనే పసుపు, చింతపండు వేసి మగ్గించాలి. కొత్తిమీర పూర్తిగా మగ్గి, మెత్తబడిన తర్వాత దింపేయాలి. ముందుగా వేయించుకున్న దినుసులు పొడి చేసుకుని కొత్తిమీర చింతపండు మిశ్రమం, తగినంత ఉప్పు వేసి కాస్త బరకగానే రుబ్బుకోవాలి. చిన్న గినె్నలో మిగిలిన నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, చివరిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత రుబ్బుకున్న పచ్చడిలో కలుపుకోవాలి.

No comments:

Post a Comment