కందిపప్పు కట్టుచారు

కావలసినవి                                                                                                                             :

కందిపప్పు - 50 గ్రా.
ఉల్లిపాయ - 1 చిన్నది
 పచిమిర్చి - 2
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
ఎండుమిర్చి - 3 ఆవాలు
జీలకర్ర - 1/4 టీ.స్పూ.
ఇంగువ - చిటికెడు
పసుపు - 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 2 టీ.స్పూ.

తయారి విదానం :                                                                                                                 
 కందిపప్పు కడిగి, కొద్దిగా పసుపు తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. లేదా పప్పు ఉడికించినప్పుడు పైన పేరుకున్న నీళ్ళను తీసుకోవచ్చు. ఈ పప్పు నీళ్లను పలుచగా చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, మిగిలిన పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. గినె్నలో నూనె వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న కట్టుచారు వేసి మరిగించాలి. చివరిలో కొత్తిమీర వేసి దింపేయాలి.

No comments:

Post a Comment