క్యాబేజ్ పచ్చడి

కావలసినవి
క్యాబేజ్ చిన్నది 1
పచ్చిమిరపకాయలు  4
ఎండు మిర్చి 6
చింతపండు 10 గ్రాములు  
సాల్ట్ తగినంత
రిఫైండ్ ఆయిల్   4 స్పూన్స్
శనగపప్పు    2 స్పూన్స్
మినపప్పు   1  స్పూన్
ఆవాలు 1/2 
జీలకర్ర 1/2
పసుపు చిటెకెడు
కొత్తిమీర ఒక కట్ట
ఇంగువ 1 స్పూన్

తయారు చేయు విధానం --క్యాబేజ్ ని సన్నగా తురుముకోవాలి. స్టవ్ వెలిగించి. కళాయి లో ఆయిల్ వేసి, అందులో  క్యాబేజ్ తురుము ని వేసి, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు ,సాల్ట్, పసుపుఇంగువ  వేసి, మెత్తగా మగ్గే వరకు ఉంచాలి. ఇంకొక కళాయి లో ఆవాలు మినపప్పు శనగ పప్పు జీలకర్ర ఎండు మిర్చిని  ఆయిల్ లో వేయించుకొని చల్లారాక కొన్ని పోపు గింజలు వుంచి మిగతావి మిక్సి లో గ్రైండ్  చేసాక మగ్గించిన క్యాబేజ్ తురుము ని కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఏదైనా బౌల్ లోకి తీసుకొని పోపు గింజలతో పాటు
కొత్తిమీరను కూడా వేసి అలంకరించాలి ఇది అన్నం లోకే కాకుండా చపాతీలకి దోసలకి కూడా బాగుంటుంది

No comments:

Post a Comment