కావలసినవి :
కాప్సికమ్ - 100 గ్రా.
ఎర్రపప్పు - 50 గ్రా.
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
అల్లం వెల్లుల్లి ముద్ద - 1/2 టీ.స్పూ.
ధనియాల పొడి - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
తయారీ :
కాప్సికమ్ గింజలు తీసి అంగుళం సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఎర్రపప్పు కడిగి నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత కాప్సికమ్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు కాస్త మగ్గిన తర్వాత పొడి, ధనియాల పొడి వేసి కలిపి నానిన ఎర్రపప్పు తీసివేసి కలుపుతూ కొద్దిసేపు వేపాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి. ముక్కలు, పప్పు ఉడికిన తర్వాత గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.

No comments:
Post a Comment