చికెన్ కజ్జికాయలు

 కావలసినవి:                                                                                                                                  

మైదా- 1 కప్పు
గోధుమ పిండి - 1/2 కప్పు
చికెన్ ముక్కలు - 100 గ్రా.
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
పసుపు - 1/4 టీ.స్పూ.
కారంపొడి - 1 టీ.స్పూ.
 అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
 ఉప్పు - తగినంత
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
నూనె - వేయించడానికి

 తయారీ:                                                                                                                                    

 మైదా, గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఇందులో గరిటెడు నూనె లేదా కరిగించిన డాల్డా వేసి కలిపి తగినన్ని నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా తడిపి మూత పెట్టి ఉంచాలి. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీళ్లు పోసి మెత్తగా ఉడికించి ఎముకలు తీసేసి పొడి పొడిగా చేయాలి లేదా బోన్‌లెస్ చికెన్ తీసుకోవచ్చు. పాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత చికెన్ కీమా, కారంపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుతూ దోరగా వేయించాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత కొత్తిమీర, గరం మసాలాపొడి వేసి కలిపి దింపేయాలి. తడిపిన పిండి ముద్దను కొద్దిగా నూనె వేసి మృదువుగా అయ్యేలా మర్థనా చేసి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. వీటితో పూరీలు చేసుకుని మధ్యలో చెంచాడు చికెన్ కీమా మిశ్రమం పెట్టి సగం నుండి మూసేసి అంచులు గత్తిగా వత్తాలి. అంచులు మడిచి కాస్త అందంగా చేయొచ్చు. ఇలా అన్నీ చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి వీటిని నిదానంగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని తీసుకోవాలి.

No comments:

Post a Comment