కొత్తిమీర రైస్


కొత్తిమీర రైస్ తాయారు చేయడానికి కావలసినవి

1) సన్న బియ్యం 1/2 కే జి
2) క్యారట్ 2
3) బీన్స్ 12
4) బంగాళా దుంపలు 2   
5) పచ్చిమిర్చి 12 
6) కొత్తిమీర 3 కట్టలు
7) నెయ్యి   ఒక కప్
8) రిఫైండ్ ఆయిల్ 1/2
9) సాల్ట్ తగినంత
10) జీడి పప్పు     25  గ్రాములు
11)నాన బెట్టిన  పచ్చి బఠానీలు గ్రీన్ కలర్ వి 1/2  కప్

చేయు విధానం 

ముందుగా  బంగాళాదుంప   బీన్స్ క్యారట్  చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
స్టవ్ వెలిగించి కళాయి లో ఆయిల్ వేసి అది వేడి అయ్యాక అందులో జీడిపప్పు వేసి కొంచం వేగాక కట్ చేసుకున్న వెజిటబుల్ ముక్కలు కూడా వేసి వేయించాలి కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సి లో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా వేసి కొంచం వేగాక రైస్ కుక్కర్లో బియ్యం కడిగి ఆ బియ్యానికి ఒకటికి ఒకటిన్నర లెక్కన నీరు పోసి అందులో కళాయి లో వేయించినవి వేసి తగినంత సాల్ట్  నెయ్యి వేసి కుక్ చేయాలి (ప్రెషర్ పాన్ లో కానీ ప్రెషర్ కుక్కర్లో కూడా  చేయొచ్చు  కానీ వాటర్ మాత్రం ఎక్కువ  కాకుండా చూసుకోవాలి ) కుక్ కాగానే గరిటతో మొత్తం కలపాలి దీని ఉల్లి పెరుగుచట్నీతో కానీ ఏదైనా గ్రేవీతో కానీ తిన వచ్చు మసాల ఇష్టం లేక బిరియానీ తినని వారికీ ఇది బాగా నచ్చుతుంది కొత్తిమీర సువాసనతో ఘుమఘుమలాడుతూ వుంటుంది ఈ సువాసన కి ఆకలి పెరుగుతుంది

No comments:

Post a Comment