వడియాల ఉప్మా
కావలసినవి:
వడియాలు: అరకప్పు
కొబ్బరి తురుము - అరకప్పు
పచ్చిమిర్చి - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
పసుపు - చిటికెడు
మినపప్పు, ఆవాలు , జీలకర్ర - ఒక స్పూన్ చప్పున
ఎండుమిరపకాయలు : రొండు
కరివేపాకు
నునే - రొండు స్పూన్ లు
తయారీ:
వడియాలను గ్రఎండేర్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. కాసిన్ని నీళ్ళు కలిపి అరగంట పాటు నాన పెట్టాలి. మూకుడులో నునే వేసి, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. ఆవాలు చిటపట లాడక ఉల్లి ముక్కలు వెయ్యాలి. ఉల్లి పాయలు బాగా వేగాక పచ్చిమిర్చి వెయ్యాలి. అవి వేగాక నాన పెట్టిన వడియాల మిశ్రమాన్ని కలిపి ముతా పెట్టి సన్నని మంట మీద పది నిమషాలు ఉడికించాలి.ఇప్పుడు కొబ్బరిపొడి కలిపి దించేస్తే వడియాల ఉప్మా తయారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment