వెల్లుల్లి మన శరీరంలోని ఇమ్యూన్‌సిస్టం పైన గొప్ప ప్రభావం చూపుతోంది. ఇమ్యూనిటీని బాగా పెంచగల, చైతన్యవంతం చేయగల శక్తి గార్లిక్‌కు ఉంది. 1993 సంవత్సరంలో ఎయిడ్స్ రోగులపై జరిగిన పరిశీలనలో ఓ చిత్రమైన విషయాన్ని వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిడ్స్ రోగుల్లో విరివిగా వెల్లుల్లిని వాడుతూ ఆరోగ్యంగా ఉంటున్నార్నదే ఈ పరిశీలనా ఫలితం.
- ముఖంపై వచ్చే ఏక్నే తరచు ఇబ్బందిని గురిచేస్తుంది. మొటిమల కన్నా, చిన్న సైజులలో చమటపొక్కుల్లా ముఖంపై వచ్చే ఈ ఏక్నేను నిర్మూలించడానికి యాంటీబయాటిక్సు కన్నా కాస్మొటిక్సు కన్నా వెల్లుల్లే బాగా పనిచేస్తుంది.
- వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి, చల్లార్చిన గార్లిక్ డికాషన్‌తో ముఖం తరచూ కడుగుతుంటే ఈ సమస్య తగ్గిపోతుంది.
- క్యారెట్ జ్యూస్‌లో వెల్లుల్లి రసం కలిపి ముఖానికి పట్టించి ఓ అరగంట తర్వాత కడిగే స్తుంటే ముఖంపై మొటిమలు, పొక్కుల కురుపులు రానేరావ్ఞ. - ఆస్తమాతో బాధపడేవారు నిత్యం పాలల్లో ఒక రెబ్బ వెల్లుల్లి వేసుకొని మరిగించి గోరువెచ్చగా తాగితే ఉదయం, రాత్రి ఓ కప్పు పాలు, తరచూ ఆయాసం రాకుండా ఉంటుంది. వచ్చినా ఉధృతంగా రాదు.
- మధుమేహ బాధితులు వెల్లుల్లిని వాడటం వలన రక్తనాళాలకు సంబంధించిన పలు ఇబ్బం దులు, పలురకాల హృద్రోగాల నుండి రక్షింప బడతారు. సెగ్గడ్డలకు వెల్లుల్లి దివ్యమైన ఔషధం. వెల్లుల్లి పేస్టులా చేసి, సెగ్గడ్డల పైన పట్టుగా వేసి, పావ్ఞగంట ఉంచి కడిగేస్తే త్వరగా సెగ్గడ్డలు మటుమాయం అవ్ఞతాయి.
- వెల్లుల్లిని చితక్కొట్టి మరిగేనీటిలో వేసి ఆవిరులు పీలిస్తే బ్రాంకైటిస్ బాధలు తగ్గుతాయి. - గార్లిక్ యాంటీబయాటిక్సు కన్న చాలా గొప్పగా జలుబును నివారిస్తుంది. క్యారెట్టు జ్యూసులో ఓ రెబ్బ వెల్లుల్లి చిదిపి మరిగించి తాగితే రోజుకు మూడుసార్లు జలుబు మాయం.
- గార్లిక్ రెబ్బను డైరెక్టుగా నోట్లో మాత్రలా మ్రింగండి. నీరు త్రాగండి. క్రానిక్ కాన్ట్సిపేషన్ విషయంలో కూడా మంచి మందు.
- కాలి ఆనెలకు వెల్లుల్లితో చికిత్స చేయవచ్చు. వెల్లుల్లి నూరి వెనిగర్ కలిపి పేస్టులా చేసి ఆనెకు రాస్తే రోజు మార్చి రోజు ఆనె తగ్గిపోతుంది. చైనాలో ఈ ఆనెల ట్రీట్‌మెంట్ చాలా ఫేమస్ తెలుసా? - ఎగ్జిమా అన్న చర్మవ్యాధిపై వెల్లుల్లి రసాన్ని రాసినపుడు ఎగ్జిమా త్వరగా తగ్గిపోతుంది.
- ఫంగస్ కారణంగా కాళ్లకు సంభవించే ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు గార్లిక్ మంచి మందు. ఐదారు వెల్లుల్లిపాయల్ని సన్నగా తరిగి ఓ గాజు పాత్రలో వేసి ఈ ముక్కలు మునిగేంతవరకూ ఆలివ్ ఆయిల్ పోయండి. రోజూ రెండుసార్లు పాత్రను కదుపుతూ ఉండండి. మూడు రోజుల తర్వాత వడకట్టి ఆయిల్‌ను తీసి ఓ సీసాలో భద్రపరిచి ఫంగస్ ఉన్న పాదాలకు రోజూ మూడుపూటలా రాస్తుంటే మీ సమస్య తీరినట్లే.
- కొలెస్టరాల్‌ను తగ్గించే ఔషధీయ శక్తి కూడా వెల్లుల్లికి ఉంది. రోజుకు పావ్ఞ వెల్లుల్లి రెబ్బల్ని నోట్లో వేసుకుని మంచినీరు తాగాలి. ఇలా 3నెలలు చూస్తే చాలు. మొదట కొలెస్టరాల్ లెవల్ పెరిగి తర్వాత తగ్గుతుంది.
- స్నానానికి మరిగించే వేడినీటిలో వెల్లుల్లి చితగ్గొట్టి వేయాలి. ఓ పదినిమిషాలు తర్వాత గోరువెచ్చగా అయ్యేదాకా ఆగి బాగా కలియబెట్టి ఆ నీటిలో కూర్చుంటే మూలశంఖ తగ్గిపోతుంది. దీనే స్రిట్జ్ బాత్ అంటారు.
No comments:
Post a Comment