రోజూ క్యారెట్ తింటే...
కంటికింపైన రంగులో కనిపించే క్యారెట్ చక్కని రుచితోనూ నోరూరిస్తుంది. రోజూ ఒకటి చొప్పున దీన్ని తినగలిగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. అల్సర్లు, గ్యాస్ వంటి జీర్ణసంబంధిత సమస్యలూ అదుపులో ఉంటాయి. అంతేకాదు మలబద్దకం రెండు నెలల్లోనే అదుపులోకి వస్తుంది. ఇందులో అధికమోతాదులో లభించే బీటాకెరోటిన్ విటమిన్ 'ఎగా మారుతుంది. ఇది కాలేయాన్ని, కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది. శరీరంలో విషవ్యర్థాలను బయటకు పంపిస్తుంది. శరీరంలోని ఇన్‌ఫెక్షన్లు తగ్గించే యాంటీసెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. గోళ్లు, జుట్టు బలంగా పెరగడంతో పాటు చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది. మంచి ఛాయ కావాలనుకునేవారు రోజూ కేరట్ తినడం అలవాటు చేసుకోండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment